ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీనియర్ బ్యూటీ.!

frame ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీనియర్ బ్యూటీ.!

FARMANULLA SHAIK
రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టడమే కాదు.. క్రేజీ కాంబినేషన్స్ తోనూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి ఇమ్మీడియెట్ గా రాబోతున్న చిత్రం ‘రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతుంది.రొమాంటిక్ హారర్ కామెడీగా రూపొందుతున్న ‘రాజాసాబ్’లో ప్రభాస్ కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి యువతరం భామలు నటిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రాజా సాబ్‌' ఒకటి. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇది ముగింపు దశ చిత్రీకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్కు మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్కు ప్రభాస్‌తో కలిసి ఓ కోలీవుడ్ బ్యూటీ స్టెప్పులేయనున్నట్లు అప్పట్లో టాక్ నడించింది. అయితే తాజాగా ఈ విషయం గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం ఇప్పటికే ఆమెను అప్రోచ్ అవ్వగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేకుంటే వచ్చే నెలలో ఆ సాంగ్ షూటింగ్ జరిగే అవకాశముందని సినీ వర్గాల టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ స్టార్ పెయిర్ను ఒకటే స్క్రీన్పై మళ్లీ చూసే అవకాశం దక్కనుందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.ప్రభాస్, నయనతార జంటగా నటించిన ‘యోగి’ 2007లో విడుదలైంది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోని సెట్ చేయబోతున్నాడట డైరెక్టర్ మారుతి. అసలు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’లో ప్రభాస్ కి జోడీగా నయనతార నటించనుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ‘రాజాసాబ్’లో స్పెషల్ నంబర్ కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.మరోవైపు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ను సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: