గూగుల్‏లో ఈ సంవత్సరం ఎక్కువగా .. సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ఇదే..!

frame గూగుల్‏లో ఈ సంవత్సరం ఎక్కువగా .. సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ ఇదే..!

Amruth kumar
2025 సంవత్సరం ప్రారంభానికి మరో రెండు వారాలు సమయం మాత్రమే మిగిలింది .. అందుకే ఈ సంవత్సరంలో జరిగిన ప్రత్యేక విషయాల గురించి అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు . అలాగే ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమాలు , అగ్ర నటుల పాటల గురించి కూడా సోషల్ మీడియాలో తెగ తెలుసుకుంటున్నారు .. అలాగే గూగుల్ , స్పాటిఫై  వంటి కంపెనీలు టాప్ 10 ర్యాంక్ జాబితాలను విడుదల చేశాయి .. రీసెంట్గా 2024 లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబిత‌ను గూగుల్ రిలీజ్ చేసింది .. ప్రేక్షకులు ఎక్కువగా ఏ సినిమాలు గురించి గూగుల్ లో సర్చ్ చేసారు అనేది ఇక్కడ చూద్దాం.  ముందుగా బాలీవుడ్ నుంచి రాజ్‌కుమార్ రావు , శ్రద్ధా కపూర్ నటించిన హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 .. ఈ సినిమా మొదటి భాగం 2018 లో వచ్చి మంచి విజయం అందుకుంది .. ఇక ఈ యాడాది రిలీజ్ అయ‌న‌ రెండో పార్ట్ కూడా మంచి విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది.  

ఇక తర్వాత టాలీవుడ్ నుంచి నాగ్ అశ్విన్  దర్శకత్వంలో ప్రభాస్ అమితాబ్ బ‌చ్చన్ , కమలహాసన్ , దీపికా పదుకొనే ముఖ్య పాత్రలో నటించిన కల్కి 2898AD .. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది .. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు  క్రియేట్ చేసింది .  మరో బాలీవుడ్ హీరో విక్రమ్ మాస్సే హీరో గోచన 12 ఫెయిల్.. ఈ సినిమా పోటీ పరీక్షలు రాసేవారికే కాకుండా ఎంతో మందికి ఎంతో స్ఫూర్తిదాయకంగా మారింది .. ఈ సినిమా గత సంవత్సరం విడుదలైనప్పటికీ .. ఈ సంవత్సరం కూడా చాలామంది గూగుల్ లో ఈ సినిమాని వెతికారు .. లపట లేడీస్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెర్కెక్కించిన లపాటా లేడీస్ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది .. మహిళల్లో స్ఫూర్తిని నింపేలా తెర్కక్కిన ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్షించి మంచి విజయం అందుకుంది.  

టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుని మంచి హిట్గా నిలిచింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం చైనాలో కూడా విడుదలైంది. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం OTDలో విడుదలైన సినిమాలలో మొదటి స్థానంలో ఉంది.అలాగే మంజుమ్మేల్ బాయ్స్ 7వ స్థానంలో.. విజయ్ ది కోడ్ 8వ స్థానంలో, ప్రభాస్ నటించిన సలార్ సినిమా 9వ స్థానంలో ఉన్నాయి. ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన ఆవేశం సినిమాను సైతం ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: