నేటితో బిగ్ బాస్-8 పూర్తి.. విన్నర్, రన్నరప్ వాళ్లేనా?

frame నేటితో బిగ్ బాస్-8 పూర్తి.. విన్నర్, రన్నరప్ వాళ్లేనా?

MADDIBOINA AJAY KUMAR
నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగనుంది. సెప్టెంబర్ 1వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్ 8.. నేటితో 100 రోజులు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. నేటితో ఈ సీజన్ విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్‌ని తేల్చే ఓటింగ్ కూడా ముగిసింది. ఈ షోని ఎంతగానో ఆదరించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు నేడు జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సీజన్ లో వైల్డ్ కార్డులతో కలిపి 22 మంది బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అయ్యారు. అందులో ఇప్పుడు నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. ఈ ఐదుగురు ఫైనాలిస్ట్ ల మధ్య జరిగే ఓటింగ్ ప్రక్రియలో కేవలం ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన నిఖిల్ వర్సెస్ వైల్డ్ కార్డు ఎంట్రీలో వచ్చిన గౌతమ్ మధ్య రసవత్తరంగా పోటీ సాగింది.
ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి నిఖిల్ తన ఆటతో ప్రేక్షకుల మనసు గెలుకున్నాడు. దీంతో మొదటి నుండి నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని టాక్ వినిపిస్తూనే ఉంది. అయితే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ సీజన్ 7 లో ఫైనల్స్ వరకు వచ్చి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈ సీజన్ లో అశ్వద్దామా 3.0 అంటూ వైల్డ్ ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను తన వైపుకు తిప్పుకున్నాడు.
ఈ సీజన్ ప్రారంభం నుంచి నిఖిల్ ఉండడంతో గౌతమ్ ఎంత కష్టపడిన విన్నర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు కారణం ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వడం. కానీ టాప్ 2లో నిలిచి రన్నర్ అవుతాడని అనుకుంటున్నారు. దాంతో హౌస్ లో ఉన్న నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశం గట్టిగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: