సింపతీ.. సపోర్ట్ అంతా హీరోలకేనా.. చనిపోయిన సామాన్యులకు ఉండదా..?
అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన హీరో ఆ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒక సాధారణ మహిళ మరణిస్తే ఒక్కరంటే ఒకరు కూడా సినిమా వాళ్లు వెళ్లి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదట. మద్దతుగా కూడా నిలచలేదని.. ఎందుకంటే ఆమె ఒక సాధారణ మహిళ కాబట్టి బన్నీ సెలబ్రిటీ కాబట్టి అంతేకాకుండా ఆ మహిళ ఇండస్ట్రీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆమెను పట్టించుకోలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్కొక్కరు వందల కొద్ది పారితోషకం తీసుకుంటున్నప్పటికీ కేవలం పాతిక లక్షలు ఇస్తే సరిపోతుందా? ఒక సాధారణ మహిళ ప్రాణం విలువ అంతేనా అంటూ మరికొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ ఒక స్టార్ హీరో ఆ బాధితురాలి కుటుంబ ఇంటికి వెళ్లి కనీసం ఒక కోటి రూపాయలైనా ఇచ్చి ఉంటే ఈరోజు అల్లు అర్జున్ మీద ఇంత నెగెటివిటీ వచ్చేది కాదనే విధంగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.. అంతేకాకుండా లాయర్లకు, కోర్టులకు లక్షల లక్షల ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదని.. ఒక కామన్ మ్యాన్ ప్రాణం విలువ ఇంత తక్కువ సింపతి కూడా ఉండదా పరామర్శ కూడా ఉండదా అన్నది ఇప్పుడు ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.