అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. జైలుకు అల్లు అర్జున్..!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడు అంటూ పలు రకాల కేసులు నమోదయ్యాయట ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు సైతం అరెస్టు చేసినట్లు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ కావాలనే టార్గెట్ చేస్తూ ఇలా చేస్తున్నారని అభిమానుల సైతం ఆవేదన చెందుతున్నారు.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, నిర్మాతలు, పలువురు రాజకీయ వేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టు పైన తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నారు.
ఇక ఇతర భాషలలోని నటినటులు కూడా ఈ విషయం పైన స్పందిస్తూనే ఉన్నారు. చిరంజీవి ,నాగబాబు వంటి వారు కూడా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మరి అక్కడ అల్లు అరవింద్ కి ధైర్యాన్ని చెబుతున్నారట.. పుష్ప 2 సినిమా భారీ సక్సెస్ తో దూసుకుపోతున్న తరుణంలోని ఇలాంటి సంఘటన జరగడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.. మరి మొత్తానికి అల్లు అర్జున్ ని కావాలనే శుక్రవారం రోజున అరెస్టు చేశారని ఆ మరుసటి రోజున రెండవ శనివారమని ఆమరసటి రోజున ఆదివారం కావడం చేత బెయిల్ ఇవ్వకూడదని ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపైన తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.