వామ్మో..కీర్తి సురేష్ ఆంటోని మధ్య అంతా ఏజ్ గ్యాప్ ఉందా?
అయితే 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు దీపావళి పండుగ రోజు కీర్తి సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. ఇకపోతే కీర్తి వివాహం చేసుకున్న ఆంటోని గొప్ప వ్యాపారవేత్త. ఆయనకి చెన్నై, కొచ్చిలో వ్యాపారాలు ఉన్నాయి. చిన్నప్పటినుండి కలిసి చదువుకున్న వీరిద్దరూ కాలేజీ టైమ్ లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ బంధాన్ని 15 ఏళ్ల తర్వాత పెళ్లి బంధంగా మార్చుకున్నారు.
కీర్తి సురేష్, ఆంటోని మధ్య ఏజ్ గ్యాప్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. కీర్తి మలయాళ నిర్మాత సురేష్ కుమార్, సీనియర్ హీరోయిన్ మేనకా సురేష్ దంపతుల రెండో కుమార్తె. కీర్తి సురేష్ భర్త ఆంటోనీ తట్టిల్ 1989లో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 35 ఏళ్లు. కీర్తి సురేష్ కంటే ఆంటోనీ మూడేళ్లు పెద్ద. ఇక యువనటి కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత తన అందం, అభినయంలో వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరైన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ గ్లామరస్ బ్యూటీ ఫాన్స్ తాను పెళ్లి తరువాత ఎలాంటి సినిమాలు తీస్తుందో అని సోషల్ మీడియాలో వేదికగా చర్చించుకుంటున్నారు.