రెడ్ల నామస్మరణలో అల్లు అర్జున్... సుకుమార్‌ను రెడ్డిని చేసేశాడే..?
పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్‌కి అసలు ఏమైంది ? పుష్ప 2 కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజా గా మాటల్లో తడబాటు, చేతల్లో తొందరపాటు కనిపిస్తుందన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న బన్నీ స్పీచ్ లో పూర్తిగా తడబాటు కనిపిస్తోంది. దీని వెనక దేని ప్రభావం ఉందన్న చర్చ కూడా తెర మీదకు వస్తోంది. విచిత్రం ఏంటంటే పుష్ప 1 .. పుష్ప 2 లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు తీసిన దర్శకుడు సుకుమార్ పేరు కూడా బన్నీ మర్చిపోయాడు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో బన్నీ సుకుమార్ పేరును బండి సుకుమార్ రెడ్డిగా ప్రస్తావించారు. వాస్తవానికి సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. ఏకంగా అల్ల్లు అర్జున్ ఆయన కమ్యూనిటీనే చేంజ్ చేసి పలకడం విశేషం. మరి కొందరు మాత్రం బన్నీ తన భార్య స్నేహ రెడ్డి కమ్యూనిటీ నామస్మరణలో మునిగి తేలుతున్నాడని.. అందుకే సుకుమార్ నాయుడును సుకుమార్ రెడ్డిని చేసేశాడని అంటున్నారు.
దీంతో కొందరు అయితే బన్నీకి నంద్యాల వాటర్ బాగా వంటబట్టినట్లుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ టైమ్‌లో వైసీపీ పార్టీ అందుకేగా నీకు సపోర్ట్ చేసింది అంటూ మరి కొందరు సెటైర్లు పేల్చుతున్నారు. బ్రాండు అంటూ సినిమా లో చించేసు కుంటోన్న బన్నీ బయట మాత్రం ... బ్రాండ్లే మార్చేస్తున్నాడని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఇంటి పేరును మర్చిపోయి పలకడం గమనార్హం. పుష్ప 2 సినిమా సక్సెస్‌తో పేర్లు మర్చిపోవడమేంటన్న విమర్శలు ఇప్పుడు బన్నీ పై సోషల్ మీడియా లో పడుతున్నాయి. భారీ సక్సెస్ అందుకున్న బన్నీ ట్రోల్ మెటీరియల్‌గా మారటం బాధాకరం అని చెప్పాలి.