బాలయ్య కెరీర్ లో విభిన్నమైన మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆ ఘనత సాధించిందిగా!

Reddy P Rajasekhar
స్టార్ హీరో బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో భిన్నమైన సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్నారు. బాలయ్య కెరీర్ లో విభిన్నమైన మూవీలలో గౌతమీపుత్ర శాతకర్ణి ఒకటి. క్రిష్ డైరెక్షన్ లో తక్కువ సమయంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్ లో ఈ ఘనతను సాధించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
 
శ్రియా శరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్య క్రిష్ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో చెప్పలేము. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. బాలయ్య రెమ్యునరేషన్ ఏకంగా 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
 
బాలయ్య తర్వాత మూవీ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా విడుదలకు 28 రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కెరీర్ ప్లానింగ్ మాత్రం ఆహా అనేలా ఉందని చెప్పవచ్చు.
 
బాలయ్య కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్న నేపథ్యంలో బాలయ్య తర్వాత సినిమాలు 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య అఖండ2 కూడా 2025 సంవత్సరంలో విడుదల కానుంది. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని 2025 సంవత్సరంలో బాలయ్య ఖాతాలో భారీ హిట్లు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: