ఈ సైనిక చీమల గురించి తెలుసా.. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటంటే?

praveen
ఈ ప్రకృతిలో మనుషులకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. అయితే అన్ని తమకే తెలుసు అని మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో రకాల రహస్యాలు తెరమీదకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. మన పక్కనే జరుగుతున్న ఈ రహస్యం ఇన్నాళ్లు గుర్తుపట్టలేకపోయామే అని ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రహస్యం కూడా ఇలాంటిదే.

 సాధారణంగా రాజుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజులకి సైనికులు రక్షణగా నిలిచేవారు. ఏకంగా సైనికులను ముందు పెట్టి రాజులు వెనకాల ఉండేవారు. ఇక సైనికులు తమ దేశాన్ని పాలించే రాజులకు కాకుండా రక్షణ కవచంలా నిలిచేవారు  అది సరేగాని ఇప్పుడు రాజుల కాలం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అంటారు కదా. అయితే ఇక ఇప్పుడు చీమల గురించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. రాజుల కాలం నాటికి ఇప్పుడు చీమలకు సంబంధం ఏంటా అనే కదా మీ డౌట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సైనిక చీమల గురించి.

 సైనిక చీమలా.. ఇప్పటివరకు ఎన్నో రకాల చీమలను చూసాం. కానీ ఇలా సైనిక చీమలు కూడా ఉంటాయని మొదటిసారి వింటున్నాం అని అనిపిస్తుంది కదా. నిజమే ఈ చీమల గురించి తెలిస్తే ఆశ్చర్య పోక మానరు. ప్రతి రాజ్యానికి సైనికులు ఉన్నట్లే ప్రత్యర్ధుల నుంచి చీమల పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. తమ రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ళ ప్రవేశాన్ని మూసేసి వాటికి అడ్డుపడుతూ ఉంటాయి. తలను గూడు వద్ద తలుపుల ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే పక్కకు జరిగి మళ్లీ లోపలికి రావాలంటే పక్కకు జరుగుతూ ఉంటాయి. కానీ చొరబాటుదారులను లోపలికి రానివ్వకుండా రక్షణ కవచంలా నిలుస్తూ ఉంటాయి ఈ చీమలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: