నా ప్రతి కథలో.. మొదట గుర్తొచ్చే హీరో అతనే.. షాకింగ్ విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ?

praveen
ఇటీవల కాలంలో కొత్త కథలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతల డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో రొటీన్ సినిమాలను తీస్తున్న దర్శకులను కాకుండా కొత్త కథలతో ప్రేక్షకులను ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తున్న దర్శకులకు ప్రేక్షకులు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారి సినిమాలను చూస్తూ బ్లాక్బస్టర్ చేస్తూ ఉన్నారు. ఇలా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పుడు వరకు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. అందరితో పోలిస్తే ఎంతో డిఫరెంట్ కాన్సెప్ట్ను తీసుకొని ప్రశాంత్ వర్మ తన సినిమాలతో హిట్టు కొడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక మొన్నటికీ మొన్న హనుమాన్ అనే సినిమా తీసి పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టేశాడు. ఎలాంటి అంచనా లేకుండా చిన్న సినిమాతో వచ్చి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. దీంతో ప్రశాంత్ వర్మ ఏ సినిమా తీసిన మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

 అయితే ఎప్పుడు డిఫరెంట్ కథలను రాసుకొనే ప్రశాంత్ వర్మ హీరోల ఎంపిక విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడు. సాధారణంగా ఒక దర్శకుడు కథను రాసుకున్న విషయంలో ఒక హీరోని ఊహించుకొని రాసుకుంటాడు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రతి కథ రాసుకునేటప్పుడు ప్రశాంత్ వర్మ ఓకే హీరోని ఊహించుకుంటాడట. ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. తను రాసుకునే ప్రతి కథలో తనకు మొదటి గుర్తొచ్చే హీరో సాయి దుర్గ తేజ్ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. సాయి దుర్గ తేజ్ 18వ కార్నేల్ ఈవెంట్లో ఆయన మాట్లాడాడు. సాయి తేజ్ ఏ కథలోనైనా ఫిట్ అయ్యే హీరో.మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ మళ్ళీ ఆయన పుంజుకొని దూసుకొచ్చారు. అయితే సాయితేష్ లుక్ చూసి షాక్ అయ్యా.. వీఎఫ్ ఎక్స్ అనుకున్న. దర్శకుడిని అడిగితే రియల్ అని చెప్పడంతో మరింత ఆశ్చర్యపోయ అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: