టాలీవుడ్‌లోకి మాస్ మహరాజ్ కూతురు ఎంట్రీ... !
- కుమారుడు మోక్షధన్ అదే బాట లో .. !
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ లో మాస్ మహారాజ్ సీనియర్ హీరో రవితేజ కు ఇద్దరు పిల్లలు అబ్బాయి. మహాధన్ కుమార్తె . . కుమారుడు మోక్షధన్ . కుమారుడు బాగా యాక్టివ్ గా ఉంటాడు .. మనోడికి సినిమా లో ఉంటే చాలా ఇష్టం.. మహాధన్ త్వరలో హీరో అవుతాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే అంతకంటే ముందే మోక్షధ ఇండస్ట్రీ లో అడుగు పెట్టేసింది .. అది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కావడం విశేషం. మోక్షధాన్ కు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ముందు నుంచి ఆసక్తి ఉంది. దర్శకత్వం లో మెలకువలు నేర్చుకునే పనులు తాను బిజీగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే ఓ సినిమా కోసం ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మహాధన్ కూడా ఓ అగ్ర దర్శకుడు దగ్గర దర్శకత్వంలో శిక్షణ తీసు కుంటున్నాడని తెలుస్తోంది.
మహాధన్ నటనతో పాటు దర్శకత్వం కూడా నేర్చుకుంటున్నాడా ? లేదంటే తాను దర్శకుడు కావాలని అనుకుంటున్నాడా ? అన్నది తెలియాల్సి ఉంది. రవితేజ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనే పనిచేశాడు. అసలు దర్శకుడు అవ్వాలని సినిమాల్లోకి వచ్చాడు ... కానీ అనుకోకుండా నటుడు అయ్యాడు. ఆ తర్వాత స్టార్ గా మారాడు. ఇప్పుడు అదే బాటలో వారసులు కూడా నడుస్తున్నారేమో అనుకోవాలి. స్టార్ పిల్లలు డైరెక్షన్ నేర్చుకోవాలంటే విదేశాల్లో కోర్సులు చేసి తిరిగి ఇండియాకు వస్తారు. కానీ రవితేజ పిల్లలు అలా కాదు. ఇండస్ట్రీలోనే ఉంటూ.. అందరిలా, దర్శకుల దగ్గర సహాయకులుగా పని చేస్తూ సినిమాలోని సాధక బాధకాలు దగ్గరుండి చూస్తూ, నేర్చుకొంటున్నారు. ఈ విషయంలో రవితేజ ని మెచ్చుకోవాల్సిందే.