ఎంత ఎదిగినా ఆయన చిన్న పిల్లాడే.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రాక్ స్టార్ దేవి ప్రసాద్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా అద్భుతంగా రానిస్తున్నాడు.. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో తన మ్యూజిక్ తో అదరగొడుతున్నాడు.. అయితే బన్నీ, దేవిశ్రీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. వీరు చిన్ననాటి నుండే స్నేహితులు కావడం విశేషం... బన్నీ ఏ సినిమా చేసినా  కూడా దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీనే ఉండేలా చూసుకుంటారు.ఇప్పటి వరకూ బన్నీ హీరోగా నటించిన సినిమాలకు ఎక్కువగా పనిచేసింది కూడా డీఎస్పీనే. వారిరువురి మధ్య సుకుమార్ జాయిన్ కావడంతో ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఆర్య సినిమా దగ్గర నుంచి ఆ ముగ్గురు మరింత క్లోజ్ అయ్యారు. 'పుష్ప' సినిమా భారీ విజయంతో  దేవిశ్రీ ప్రసాద్ పేరు పాన్ ఇండియా వైడ్ మారుమ్రోగిపోయింది..

తాజాగా బన్నీతో తన స్నేహ బంధం గురించి డీఎస్పీ మరోసారి రివీల్ చేసారు. ' ఇద్దరం చిన్ననాటి స్నేహితులం.బన్నీ మా ఇంటికొచ్చి ఆడుకునేవాడు.అలాగే నేను తన ఇంటికెళ్లి ఆడుకునేవాడిని. బన్నీ ఎప్పుడు చెన్నై వచ్చినా మా ఇంటికే వస్తాడు.తాను పెద్ద హీరోని..ఇలాగే ఉండాలి అని ఏమి అనుకోడు...తన మనసుకు దగ్గరైన వారందరితో బన్నీ ఎంతో స్నేహంగా వుంటారు..నేను నా స్టూడియోలో పాటలు రికార్డింగ్ చేస్తుంటే ఆ పాటలకు బన్నీ ఎంతో జాలీగా డాన్సు చేస్తుంటాడు. తన ఎంత ఎదిగినా లోపల ఇంకా చిన్న పిల్లాడి మనస్తత్వం అలాగే వుంది.'పుష్ప-2' సెట్ లో గంగమ్మ తల్లి అవతారంలో బన్నీని చూసాక చూస్తే సాక్షాత్తు అమ్మవారే నడిచి వచ్చినట్లుగా అనిపించింది' అని దేవిశ్రీ అన్నారు. అయితే 'పుష్ప' సినిమాకు గానూ మా ఇద్దరికి జాతీయ అవార్డులు రావడం ఎంతో హ్యాపీగా అనిపించింది..బన్నీ మరిన్ని అవార్డులు అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు దేవిశ్రీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

DSP

సంబంధిత వార్తలు: