ఏపీ: టిడిపి మంత్రి ఇంట విషాదం..!

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూటమిలో యంగ్ లీడర్స్ కే మినిస్టర్ పదవులు అందుకోవడం జరిగింది.. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర కూడా ఒకరు.. కొల్లు రవీంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మంత్రి ఇంట విషాద ఛాయలు నిలముకున్నట్లు తెలుస్తోంది.. కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గుండెపోటుతో గడిచిన కొన్ని గంటల క్రితం తుది  శ్వాస వెలిచినట్లుగా సమాచారం.. అయితే ఈ విషయం విన్న వెంటనే కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. దీంతో టీడీపీ నేతలు అభిమానులు , కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉంటున్న కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ 64 ఏళ్ల వయసులో గుంటూరుతో మరణించారు.. కొల్లు వెంకటరమణ కు ఇద్దరు పిల్లలు ఉన్నారట.. తన తమ్ముడు మరణ వార్త విన్న వెంటనే కలెక్టర్లతో సమావేశమైన కొల్లు రవీంద్ర  హుటాహుటిగా తన సొంత ఊరికి బయలుదేరారట.. కొల్లు రవీంద్ర తన సోదరుడు అంతక్రియలు కూడా ఈ రోజే జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. కొల్లు వెంకటరమణ మృతి పట్ల పలువురు టిడిపి నేతలు, మంత్రులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

కొల్లు రవీంద్ర గెలుపులో కీలకంగా తన తమ్ముడు కొల్లు వెంకటరమణ ఉండేవారట.. కొల్లు రవీందర్ 1998 నుంచి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షునిగా రాజకీయాలలోకి ఎంట్రి ఇచ్చి ఆ తర్వాత పదేళ్లపాటు పదవిలో కొనసాగి 2009 మచిలీపట్నం నుండి టిడిపి టికెట్ సంపాదించుకున్న 9,300 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన పేర్ని వెంకటరామయ్య చేతిలో ఓడిపోయారు. అయితే 2014లో మళ్లీ అదే వ్యక్తి పైన భారీ విజయంతో గెలిచారట. అలా అప్పట్లో కూడా మంత్రిగా అవకాశాన్ని అందుకున్నారట..ప్రస్తుతం కొల్లు రవీంద్ర ఆంధ్ర ప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాస్త్ర , ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: