మంచు వ్యవహారంపై కొత్త ట్విస్ట్..ఇదంతా దానికోసమేనంటూ.?

FARMANULLA SHAIK
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ చాలా వివాదం అవుతోంది. మంచు విష్ణు, మంజు మనోజ్ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నట్లు, ఈ నేపథ్యంలో మనోజ్‌పై మోహన్ బాబు దాడిగి దిగినట్లు అనేక రకాల వార్తలు ప్రచురితం అవుతున్నాయి.అయితే సెలబ్రిటీల ఇళ్లలో జరిగే సంఘటనలపై ప్రజలు కూడా ఆసక్తిని చూపిస్తుంటారు కనుక మీడియా కూడా ఈ విషయంలో కాస్త అత్యుత్సాహం కనబరిచింది. దీంతో జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఓ టీవీ చానల్‌కు చెందిన జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేయడం వల్ల ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.ఈ క్రమంలో టీవీ9 రిపోర్టర్‌పై మైక్‌తో మోహన్ బాబు దాడి చేయడంతో జర్నలిస్ట్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు పై మరో కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు నటిస్తున్న భక్త కన్నప్ప మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు మనోజ్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: