పుష్ప2 హిందీలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా..అంతా ఆమె పుణ్యమే..!

Thota Jaya Madhuri
పుష్ప2 ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగి పోతూ హైలెట్గా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమానే ఈ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది . అంతేకాదు డిసెంబర్ ఐదవ తేదీ థియేటర్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది . రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఫాస్టెస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక ఇండియన్ ఫిలిం గా చరిత్ర సృష్టించింది .


ఇప్పుడు అప్పుడే ఈ సినిమా రికార్డులు ఏ సినిమా బీట్ చేయలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే . బహుశా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో సినిమా బీట్ చేయొచ్చు అంటూ ఆశపడుతున్నారు జనాలు . కానీ అది జరిగే పని కాదు అంటూ తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు . అయితే పుష్ప2 మూవీ తెలుగులో హిట్ అవుతుందని అంత అనుకున్నారు . అది కన్ఫామ్ కానీ హిందీ అదేవిధంగా మలయాళం లో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంతా భావించారు . మలయాళం లో అనుకున్నంత సక్సెస్ రాలేకపోయినా హిందీలో మాత్రం అనుకున్న దానికి 100 కోట్లు ఎక్స్ట్రానే కలెక్ట్ చేసి చూపించింది పుష్ప2.


మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 254 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీని తిరగ రాసిన పుష్ప2.. నార్త్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది . హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది . మొదటి రోజు 75 కోట్లు కలెక్ట్ చేయగా రెండవ రోజు 59 కోట్లు మూడవరోజు 74 కోట్లు నాలుగవ రోజు 86 కోట్లు ఇక 5వ రోజు 48 కోట్లు ఆరవ రోజు 36 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ వద్ద పుష్ప రాజు గాడు మానియా అంటే ఏంటో చూపించింది. అయితే కేవలం హిందీలోనే ఆరు రోజుల్లో 375 కోట్లు  క్రియేట్ చేసింది పుష్ప2. దీనంతటికీ కారణం రష్మిక మందన్నా అంటున్నారు జనాలు . యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో ఆమె క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే పుష్ప2 సినిమా మరింత హైలెట్గా మారి సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: