మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల వెనుక కేటీఆర్‌..మంచు లక్ష్మి బాంబ్?

Veldandi Saikiran
ఈ మధ్యకాలంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత...కేటీఆర్ ను ఉద్దేశించి రకరకాల కేసులు పెడుతున్నారు.అంతేకాదు తెలంగాణ మహిళా మంత్రి కొండ సురేఖ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ సమంతతో సంబంధం ఉన్నట్లు ముడి పెట్టారు కొండా సురేఖ. అయితే తాజాగా... మరో సెలబ్రిటీ గొడవలోకి మాజీ మంత్రి కేటీఆర్ ను లాగారు సోషల్ మీడియా కార్యకర్తలు.

 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మంచు కుటుంబానికి సంబంధించిన  గొడవ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్  మధ్య గొడవలు జరుగుతున్నాయి. అసలు చెప్పకుండానే... తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు.అయితే సెలబ్రిటీ కుటుంబం కావడంతో ఇందులోకి మీడియా కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇంటి పంచాయతీ కాస్త రోడ్డుపైకి వచ్చింది.
 అంతేకాదు మీడియాలో మోహన్ బాబు కుటుంబం పైన  వార్తలు వేసినందుకు ఓ మీడియా ప్రతినిధి పైన కూడా దాడి చేయడం జరిగింది. దీంతో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో...  మంచు ఫ్యామిలీ మధ్య గొడవలకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమైనట్లు... ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా మంచు లక్ష్మి ఈ విషయాన్ని చెప్పినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారట.
 మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ కుమార్ ఫోన్లు టాప్ చేసి.... వారిద్దరి మధ్య కేటీఆర్ గొడవ పెట్టినట్లు.. కొంతమంది కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నట్లు గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అది కూడా మంచు లక్ష్మి పేరును తెరపైకి తీసుకువచ్చి... ఈ రచ్చ చేస్తున్నారట కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు. అయితే ఈ విషయాన్ని గులాబీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడను ఎండగట్టారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: