
ఆ వ్యక్తి కోసం కింగ్ డమ్ టీమ్ వేటింగ్
ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. ఇక టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వేసవి సెలవులలో మే 30న రిలీజ్ అవ్వనుంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా పనుల్లో అనిరుధ్ ఇక జాయిన్ అవ్వలేదని తెలుస్తోంది. ఇతర సినిమాల ప్రాజెక్ట్ లలో అనిరుధ్ బీజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా కింగ్ డమ్ మూవీలో జాయిన్ అవ్వలేదని మూవీ మేకర్స్ చెప్పారు. ఈ సినిమాని అనిరుధ్ సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బొర్సె నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా, రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో మరో సినిమాతో రెడీగా ఉన్నాడు. ఇక ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటుగా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రౌడీ బాయ్ ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.