ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కలయికతో కూటమి ఏర్పాటు అయింది. అయితే ఈ మూడు పార్టీలు ఏకమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి 11 స్థానాలు రాగా కూటమికి 160 కి పైగా స్థానాలు రావడం మనం చూసాం. అయితే ఇలాంటి నేపథ్యంలో... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మరో నాలుగు నుంచి ఐదు శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ నియామకమయ్యారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో జనసేనకు ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. అటు నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేనకు మంచి స్థానమే దక్కింది. కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరికీ పదవులు రాబోతున్నాయట.
ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీకేబినెట్లో మంత్రి పదవి ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. ఆయనకు పర్యాటకశాఖ లేదా సినిమాటోగ్రఫీ పదవిలోకి ఛాన్సులు ఉన్నాయి. అయితే.. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా.. కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. చిరంజీవికి గవర్నర్ పదవి ఇస్తారని... ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఈ మేరకు కేంద్ర పెద్దలతో... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు చేస్తున్నారట. దీనికి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారమైతే.. సాగుతోంది. కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అధికారికంగా అయితే కాంగ్రెస్ లో ఉన్నట్లే లెక్క. గతంలో కేంద్ర మంత్రిగా కూడా చిరంజీవి పని చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్కు దూరంగానే ఉంటున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవికి గవర్నర్ పదవి ఇస్తే ఏ రాష్ట్రానికి పంపిస్తారో చూడాలి.