ఆ తప్పు వల్ల జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్లు.. గమనిస్తున్నారా?
జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో మరింత ఎదగాలంటే మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. దేవర ప్రమోషన్స్ విషయంలో తారక్, కళ్యాణ్ రామ్ లపై ఒకింత విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 550 కోట్ల రూపాయల కలెక్షన్లకే పరిమితమైంది. పుష్ప ది రూల్ మాత్రం సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తుంది. పుష్ప ది రూల్ లా దేవర సినిమా హిట్ గా నిలిచి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సీక్వెల్ అయినా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.
దేవర సీక్వెల్ ను తారక్ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి. వార్2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా తారక్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ కూడా గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది. తారక్ సినిమాలు వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది తారక్ నటించిన వార్2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.