అవకాశాలు లేక.. స్పెషల్ సాంగ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న వారిగా హీరోయిన్ కేతిక శర్మ కూడా ఒకరు.. ఈ అమ్మడు చేసిన సినిమాలలో కంటే ఎక్కువగా గ్లామర్ తోనే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఈమె అందానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ రోల్ పడితే కచ్చితంగా టాప్ పొజిషన్లో చేరుతుంది. అయినప్పటికీ కూడా ఈ అమ్మడికి సరైన పాత్రలు లభించలేదు. దీంతో కేతిక శర్మ ఇప్పుడు హీరోయిన్గా అవకాశాలు తగ్గుతూ ఉండడంతో స్పెషల్ సాంగ్ వైపుకు అడుగులు వేసినట్లు సమాచారం.2021లో రొమాంటిక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో తదితర చిత్రాలలో నటించింది.

నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తాజాగా కేతికశర్మ స్పెషల్ సాంగ్లో నటిస్తున్నట్టుగా ఒక పోస్టర్ ను  సైతం రిలీజ్ చేశారు.. డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక పోస్టర్ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్లో పూలమాలతో నిండుగా వేసుకొని.. తన నడుము అందాలను చూపిస్తూ ఒరచూపితో స్టెప్ వేయబోతున్నట్టుగా కనిపిస్తోంది కేతిక శర్మ.. అయితే మరి కొంతమంది నెటిజన్స్ అవకాశాలు లేక ఈ టాలీవుడ్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ వైపుగా అడుగులు వేస్తోందని ఒకవేళ ఇవి సక్సెస్ అయితే కచ్చితంగా ఈమెకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వెలుపడతాయని తెలియజేస్తున్నారు. రాబిన్ హుడ్ చిత్రానికి సంబంధించి ఈ స్పెషల్ సాంగ్ ప్రోమో ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించి లిరిక్ వీడియోను కూడా రేపటి రోజున రిలీజ్ చేయబోతున్నారట. నితిన్ కి జోడిగా శ్రీ లీల నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: