బాలయ్య కంచుకోటలోనే ' డాకూ మహారాజ్ ' ఫస్ట్ షో... ఏ థియేటర్లోనో తెలుసా..!
నందమూరి నటసింహ తన కెరీర్లో చాలా ఏళ్ల తర్వాత వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మంచి స్వింగ్లో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ ఆ తర్వాత .. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వీర సింహారెడ్డి .. గత ఏడాది చివర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా బాలయ్య కెరీర్ లో 109 వ సినిమాగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ దెబ్బకు సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రద్ధ శ్రీనాథ్ కూడా మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలయ్య సినిమాలకు వరుసగా మ్యూజిక్ అందిస్తున్న తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత బాబి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ తో పాటు మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తొలి షో హైదరాబాదులోని భ్రమరాంబ థియేటర్లో ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పుష్ప 2 దెబ్బకు తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్ అయ్యాయి. అయితే జనవరి 11వ తేదీ సెకండ్ షోను ముందుగా బాలయ్య సినిమాలకు అడ్డా అయినా బ్రమరాంబ థియేటర్లో ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణలో ఎలా ఉన్నా ఏపీలో మాత్రం 11వ తేదీ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు రాకపోతే 12వ తేదీ ఉదయం ఐదు గంటలు దాటిన తర్వాత షోలు పడతాయి.