జైలు జీవితం గురించి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కొత్త పళ్లెం, కొత్త లోటా అంటూ?

Reddy P Rajasekhar
ప్రముఖ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కస్తూరి వార్తల్లో నిలిచారు. ఈ వివాదాల వల్ల కస్తూరి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగింది. తాజాగా జైలు జీవితం గురించి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం అరెస్ట్‌ చేశారని బుధవారం బయటకు వచ్చేశానని ఆమె కామెంట్లు చేశారు.
 
నేను జైలు లోపలికి వెళ్లక ముందే అక్కడున్న వారందరికీ నేను వస్తున్నానని ముందుగానే సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. జైలులో ఉన్నవాళ్లు నా గురించి "స్టాలిన్‌ ఈమెను లోపలికి పంపాడట" అని అనుకుంటుంటే విన్నానని కస్తూరి అన్నారు. జైలులో నాకు స్పెషల్‌ సెల్‌ ఇచ్చారని తొలిసారి వచ్చిన ఖైదీలందరూ దానిలోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. నాకు కొత్త పళ్లెం, కొత్త లోటా కూడా ఇచ్చారని కస్తూరి వెల్లడించారు.
 
జైలు సిబ్బంది బాగానే చూసుకున్నారని జైలు జీవితం సినిమాలో చూపించినట్లు ఉండదని ఆమె అన్నారు. నేను అనేక సినిమాల్లో, సీరియల్స్‌లో జైలు సీన్లు చేసినప్పటికీ నిజమైన జైలు అందుకు భిన్నంగా ఉంటుందని కస్తూరి అభిప్రాయపడ్డారు. నిజమైన జైలులో ప్రమాదకరమైన వారు ఉంటారని భర్తలు చేసిన నేరాలకు జైలుకు వచ్చిన భార్యలు కూడా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
 
నేను జైలుకు వెళ్లడంతో "నువ్వు నేరం చేసి జైలుకు వెళ్లలేదు.. ఒక సిద్ధాంతం కోసం వెళ్తున్నావు" అని అన్నారని ఆమె చెప్పుకొచ్చారు. నేను జైలుకు వెళ్లకపోతే నా తెలుగు కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలిసేది కాదని ఆమె వెల్లడించారు. ఆ విధంగా చూస్తే నాకు మంచే జరిగిందని కస్తూరి వెల్లడించారు. కస్తూరి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. కస్తూరి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: