గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంపై ఎవరూ కూడా బయటపడలేదు. ముఖ్యంగా మంచు మనోజ్ తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో చాలామంది అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వైరల్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పర కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది.
నటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ తన తండ్రి తనను కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆస్తులు, స్కూల్ వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగాయని తనపై దాడి చేయించాడని, గాయాలతో పోలీస్ స్టేషన్ కి వచ్చి మరీ మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనపై మాత్రమే కాదు తన భార్యపై కూడా దాడి చేశారని మోహన్ బాబు పై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే తనను కూడా కొట్టాడని మోహన్ బాబు మనోజ్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఇక ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇందులో నిజం లేదని మంచు మోహన్ బాబు పి.ఆర్ టీం స్పందించింది. కావాలని కొన్ని మీడియా ఛానల్స్ అసత్యపు ప్రచారాలు చేశారని పూర్తి ఆధారాలు లేకుండా దీనిపై కామెంట్ చేయడం మంచిది కాదని తెలిపినట్లు సమాచారం. అయితే తాజాగా దీనిపై డిసిపి స్పందించినట్లు తెలిసింది.
మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ డయల్ 100 కు ఇద్దరూ కాల్ చేశారట. మోహన్ బాబు కాలేజీ యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ తనపై దాడి చేశాడని, తన నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడికి తెగబడ్డాడు అని పహాడి షరీఫ్ పిఎస్ లోనే తాను ఫిర్యాదు చేశానని మనోజ్ తెలిపినట్లు డిసిపి స్పష్టం చేశారని తెలుస్తోంది. మరి దీనిపై మంచు కుటుంబం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.