వంట గదిలో ఇది పెడితే చాలు.. బొద్దింకలు పరార్..!

Divya
ముఖ్యంగా మహిళలకు ఇంటిని శుభ్రం చేసుకోవడంలో ఇబ్బందికరమైన సమస్య ఏమిటంటే కిచెన్ శుభ్రం చేయడం.. ముఖ్యంగా ఎంత శుభ్రంగా చేసిన కూడా బొద్దింకలు అనేది కచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బొద్దింకలు  పరిగెత్తడం వల్ల వారికి కాస్త అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే బొద్దింకలను చంపే క్రిమిసంహారక మందులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. అయినా కూడా వీటీ ప్రభావం కొంతమేరకు చూపించిన కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల బొద్దింకల బెడద నుంచి మనం బయటపడవచ్చు. మరి బొద్దింకలు రాకుండా ఏం చేయాలో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం.

వంట గదిలో వస్తువులను ఉంచేటువంటి కంటైనర్లను బాగా శుభ్రంగా తోమి ఎండలో ఉంచిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

అలాగే ఎక్కడైనా చిన్న చిన్న రంధ్రాలు ఉండి వాటిలో నుంచి బొద్దింకలు వస్తూ ఉంటే వాటిని మూసివేయాలి లేకపోతే అక్కడ నుంచి బొద్దింకలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే హ్యాండ్ వాష్ ఇతరత్రా వంటి వాటికి పైపులీకు ఉన్నా కూడా వాటిని మార్చేయాలి..

బొద్దింకలను ఇంటిలో నుంచి పారిపోలంటే  వంటగదిలో బోరిక్ పౌడర్ ని చల్లడం వల్ల ఆ వాసనకి అవి పారిపోతాయి. ముఖ్యంగా వంటగది ఎప్పుడు తడిగా ఉండకుండా చూసుకోవాలి. అయితే బోరిక్ పౌడర్ చల్లిన తర్వాత పిల్లలను అటువైపుగా వెళ్లకుండా చూసుకోవాలి అలాగే ఆహార పాత్రలకు అంటకుండా దూరంగా ఉంచుకోవాలి.

బొద్దింకలు తరిమి కొట్టడానికి కాకర నూనె చాలా ఉపయోగపడుతుంది. నూనె లేదా పొడిని ఉపయోగించడం వల్ల వీటి వాసనకి బొద్దింకలు పారిపోతాయి.
అలాగే పలావు ఆకును చూర్ణం చేసిన తర్వాత వంట గదిలో ఏదైనా అల్మారలో ఉంచడం వల్ల ఈ వాసనకు పారిపోతాయట.

అలాగే మిరియాలు ,ఉల్లిపాయలు కాస్త పేస్టుగా చేసి ముద్దలా ఏదైనా మిశ్రమాన్ని కలుపుకొని కాస్త నీటిలో బాగా కలిపి ఆ నీటిని అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండడం వల్ల బొద్దింకలు మటుమాయం అవుతాయట.

అలాగే దోసకాయలు కట్ చేసి చిన్న చిన్న డబ్బాలలో ఉంచి పెట్టడం వల్ల వంటగదిలో నుంచి బొద్దింకలు పారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: