ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేసే కొబ్బరి పాలు... ఇలా వాడితే చాలు!

lakhmi saranya
కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అలాగే, కొబ్బరి పాలు కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. కొబ్బరి పాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు సంరక్షణలో కూడా కొబ్బరిపాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాలలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
కొబ్బరి పాలు తాగటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి కూడా కొబ్బరి పాలు బెస్ట్ రెమెడీ అంటున్నారు నిపుణులు. కొబ్బరి పాలలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. సాధారణ గుండె లయను నిర్వహించడానికి పొటాషియం ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు ఇది ముఖ్యం. కొబ్బరి పాలల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొబ్బరి పాలను తీసుకోవటం ద్వారా ఎక్కువ సేపు మీ కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
 దీంతో మీరు అతిగా తినకుండా ఉంటారు. కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్రిమినాశక లక్షణాలను ప్రసిద్ధి చెందింది. ఇది బ్యాక్టీరియా, వైరస్, శిలింధ్రాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి సహాయపడుతుంది. కొబ్బరి పాలలో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది సాధారణ హిమోగ్లోబిన్ స్థాయిలతో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తరచూ కొబ్బరి పాలను తీసుకోవటం వలన శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. జుట్టు సమస్యలను దూరం చేయటంలో కొబ్బరి పాలు ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పాలను పోషకాలు జుట్టు రాలటం, చుండ్రు సమస్యలను తగ్గించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: