సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మరో వ్యక్తి అరెస్ట్.. ఇంతకీ ఆయన ఎవరంటే?

praveen
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారం రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేసిన సంగతి తెలిసినదే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పైన పోలీసులు దాదాపు 4 గంటలపాటు 30 ప్రశ్నలు వేస్తూ, ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. అయితే ఐకాన్ బాబు ఆయా ప్రశ్నలకు చాలా కూల్ గానే సమాధానం చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇకపోతే బెయిల్ రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరయస్‌గా తీసుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈసారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ విషయం కాస్త పక్కన పెడితే, అల్లు అర్జున్ వ్యక్తిగత బాడీ గార్డ్ (బౌన్సర్) అయినటువంటి ఆంటోనిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసారు. అవును, ఈ తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అల్లు ఫామిలీకి సంబంధించి పలు ఈవెంట్లకు ఆంటోని ఆర్గనైజర్ గా వ్యవహరిస్తూ ఉంటారని వినికిడి. ఈ షో చూడడానికి అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ కి వెళ్లగా అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా..  రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఇకపోతే నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది. అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటనజరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందని సమాచారం. కాగా అల్లు అర్జున్‌ను మరోసారి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టడంతో అల్లు ఫాన్స్ అయితే తీవ్ర విచారాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మధ్యంతర బెయిల్‌పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్‌ ఛాన్స్‌ లేదు. కానీ, బెయిల్‌ రద్దుపై ఫోకస్‌ పెట్టిన పోలీసులు రానున్న రోజుల్లో అల్లు అర్జున్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని వినికిడి. ఇక ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట పోలీసులు. అయితే అల్లు హీరో ముందస్తుగానే ఆయా ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో ప్రిపేర్ అయ్యారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: