పుష్ప రాజ్ క‌న్నింగ్‌.. సూప‌ర్ ఈగో... పుష్ప రాజ్ పాత్ర‌పై RGV సెన్షేష‌న‌ల్ ...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 సినిమా ఈ నెల 5న థియేట‌ర్ల లోకి వ‌చ్చింది. సినిమాకు మంచి టాకే వ‌చ్చింది. పుష్ప 2 మూవీ కలెక్షన్ల పరంగా వైల్డ్ ఫైర్ చూపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్స్ , వివాదాలు , విమర్శలు వ‌రుస‌గా వినిపిస్తున్నాయి . . మరోవైపు ఊహించని రీతిలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెర్పామ్ చేస్తోంది. అయితే రెండు .. మూడు రోజుల నుంచి భారీ డ్రాప్స్ క‌నిపిస్తుండ‌డంతో టార్గెట్ ఎంత వ‌ర‌కు ? రీచ్ అవుతుంద‌న్న సందేహాలు ఉండ‌నే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా లో పుష్ప రాజ్ పాత్ర పై కాంట్ర‌వ‌ర్సీ ద‌ర్శ‌కుడు రాంగో పాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుష్ప 2 సినిమా పై నా రివ్యూ అంటూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ మైన ఓ పోస్ట్ ని షేర్ చేశారు. ఆ పోస్టులో రాంగోపాల్ వర్మ పుష్ప 2 సినిమా లో ని పుష్ప రాజ్ పాత్ర గురించి నా రివ్యూ ఇది ... ఇండియన్ సినిమాలలో షార్ప్ గా ఉండే పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి . .. ఒక స్టార్ హీరో స్వయంగా తన ఇమేజ్... పక్కన పెట్టి పుష్ప రాజ్ లాంటి డిఫ‌రెంట్‌ పాత్రను చేయడం చాలా అరుదు. ముఖ్యంగా ఒక లోపం ఉన్న వ్యక్తిగా నటించడం. ఇది నిజంగానే ఆరుదైన సంఘటన అని పేర్కొన్నారు.

ఇక తాను ఓ ప్రేక్షకుడిగా సినిమాను చూసినప్పుడు నిజంగానే పుష్ప లాంటి పాత్ర ఉంటుందని తాను న‌మ్మాను అని.. ఇలా ప్రేక్షకుడిని సినిమాలోని పాత్రలో జీవించి, ఆకట్టుకోవడం అన్నది ఎంత గొప్ప‌ నటుడికి అంత తేలికైన విషయం కాద‌ని ... అంటే ఇన్నోసెంట్ కలిపి ఉన్న కన్నింగ్ , సూపర్ ఈగో వంటి లక్షణాలాన్ని పుష్పరాజ్ పాత్రలో కలగలిపి ఉన్నాయి .. తాను ఇలాంటి వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేద‌ని వ‌ర్మ తెలిపాడు. తాను ఇప్పటిదాకా సూపర్ హీరో అంటే ఉన్న డెఫినిషన్ వేరు ... ఆ ప్రకారం సూపర్ హీరో పర్ఫెక్ట్ గా ఉండాల‌ని ... కానీ పుష్ప క్యారెక్టర్ లో నటించిన అల్లు అర్జున్ మాత్రం ఆ నిర్వచనాన్ని తప్పు అని ఫ్రూవ్ చేశారు.. అత‌డి బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయ‌ని తెలిపారు.

ఇప్పటి నుంచి దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక రిఫరెన్స్ పాయింట్ గా ఉంటుంది.. సీఎం తనతో ఫోటోకు ఫోజులు ఇవ్వడానికి నో చెప్పిన‌ప్పుడు ... అహం దెబ్బతిని, మనసుకు గాయం కావడం లేదా అహంకారాన్ని చంపుకుని సారీ చెప్పడానికి తాగడం సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోసి ... పుష్పరాజ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ పుష్ప 2 ద్వారా ఈ జర్నీని బాగా ఆస్వాదించాక తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పిన‌ట్టు వ‌ర్మ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: