మెగా ఫ్యామిలీపై ఆరోజే పగ పెంచుకున్న బన్నీ.. అంత అవమానించారా.?

Pandrala Sravanthi
మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం హద్దులు మీరినట్టు తెలుస్తోంది.ఎందుకంటే రీసెంట్గా పుష్ప-2 సినిమా విడుదలయ్యాక సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు మైత్రి మూవీ నిర్మాతలు చిరంజీవి ఇంటికి వెళ్లి సపోర్ట్ తీసుకున్నారు.కానీ బన్నీ మాత్రం అక్కడ కనిపించలేదు. దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టు మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ ఇప్పటివరకు పుష్ప-2 కి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లో మెగా ఫ్యామిలీని హైలెట్ చేస్తూ మాట్లాడలేదు. దానికి కారణం మెగా ఫ్యామిలీ షాడో నుండి బయటపడి అల్లు హీరోగా మాత్రమే క్రెడిట్ తెచ్చుకోవాలని ఆయన అనుకుంటున్నారట.అంతేకాదు మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు.

 కానీ అందులో చిరంజీవి,పవన్ కళ్యాణ్ ని పక్కన పెడితే రామ్ చరణ్,సాయి ధరంతేజ్,వరుణ్ తేజ్,వైష్ణవ్ తేజ్ లో పోలిస్తే అల్లు అర్జున్ పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి అనేదే ఆయన డ్రీమ్.సినిమా రిలీజ్ టైం లో చిరంజీవి పేరు చెప్పుకొని సినిమా హిట్ చేసుకున్నాడు అని రిలేషన్స్ మాట  అనకూడదనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకప్పుడు చిరంజీవి పేరుని పదేపదే మాట్లాడిన ఈయన ఇప్పుడు ఎందుకు ఆయన పేరును ప్రస్తావించడం లేదో అందరికీ అర్థమవుతుంది.ఇక పుష్ప సినిమాతో ఆయనకు రావలసిన క్రెడిట్ వచ్చేసింది.దాంతో పుష్ప-2 సినిమా కూడా ఆయనే స్వయంగాప్రమోషన్స్ చేసుకున్నారు.

మెగా ఫ్యామిలీలో పెద్ద హీరోలు ఉన్నప్పటికీ అల్లు ఫ్యామిలిలో మాత్రం ఇప్పటివరకు అంత పెద్ద హీరో ఎవరూ లేరు.కేవలం అల్లు అర్జున్ మాత్రమే. ఇక అల్లు ఫ్యామిలీలో కూడా ఓ పెద్ద హీరో ఉండాలి అది మెగా ఫ్యామిలీ చెట్టు కిందకు రాకూడదు అనే ఉద్దేశంతోనే బన్నీ అలా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నాగబాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ మీద పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. కానీ ఆయన ఒక్కడే కావడంతో ఆ అవమానాలన్నింటిని దిగమింగుకుంటూ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ జానీ సినిమా సమయంలో అల్లు అరవింద్ కి మెగా ఫ్యామిలీతో కాస్త అవమానం జరిగింది అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. తన నాన్నని అవమానించారనే ఉద్దేశంతోనే అది అంతా మనసులో పెట్టుకొని బన్నీ ఇలా సొంతంగా క్రెడిట్ సంపాదించుకోవాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: