మూడో రోజుకే ' పుష్ప 2 ' భారీ డ్రాప్.. 50 % ఆక్యుపెన్సీ కూడా లేదే.. ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లోకి వచ్చింది. ఇంక చెప్పాలంటే ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4నే ఈ సినిమా సెకండ్ షోల నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక తొలి రోజు పుష్ప గాడు ఏకంగా రు. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడని .. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఇది ఆల్ టైం రికార్డు అని గొప్పగా ప్రకటించుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే రెండో రోజుకే చాలా ఏరియాల్లో ఏకంగా 50 % డ్రాఫ్ కనిపించింది.
రెండో రోజుకే పరిస్థితి ఉలా ఉంటే మూడో రోజు వీకెండ్ శనివారం అయినా కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడని పరిస్థితి. ఇక మూడో రోజు ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తేనే ఈ విషయం క్లీయర్ గా తెలుస్తోంది. నైజాంలో సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ థియేటర్ ఏదైనా కూడా 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదని చెప్పాలి. ఇక అన్ని థియేటర్ల లో గో గ్రిన్ అన్నట్లుగా మొత్తం గ్రీనే చూపిస్తున్నాయి. ఇప్పుడు హిందీ బెల్ట్‌లో రూ. 72 కోట్లు వచ్చినట్లు .. ఇటు నైజాంలో రూ. 30 కోట్లతో సరికొత్త రికార్డ్ అని ప్రకటించారు. అయితే రెండో రోజు భారీ డ్రాఫ్ ... ఇటు మూడో రోజు కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా అయితే లేదు.
ఏదేమైనా పుష్ప 2 విషయంలో ఫస్ట్ రోజు రు. 294 కోట్ల పోస్టర్ చూసిన వారంతా.. పబ్లిసిటీ లెక్కలు మాకొద్దు.. ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ... పుష్ప-2 కలెక్షన్ల గురించి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.