బన్నీ లాగే ప్రభాస్ కూడా ఆ సినిమాలో చీర కట్టుకొని నటించాలనుకున్నాడా..? ఎందుకు చేయలేదంటే..?

Thota Jaya Madhuri
పుష్ప2 చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పొగిడే ఒకే ఒక్క పేరు బన్నీ . అల్లు అర్జున్.. స్టైలిష్టర్ స్టైలిష్ గా ఉంటాడే కానీ ఇంతలా స్టైల్ ను ఫాలో అవుతాడా అని ఇప్పుడే అర్థమైంది అంటూ బన్నీ ఫ్యాన్స్ ఓ  రేంజ్ లో పొగిడేస్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప2 ది రూల్.  నిజంగానే రూలింగ్ చేసేసాడు ఇండస్ట్రీని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని అని అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు.


ఓ రేంజ్ లో బన్ని పెర్ఫార్మన్స్ ఇచ్చాడు . మరి ముఖ్యంగా జాతర ఎపిసోడ్ . ఈ ఎపిసోడ్ ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.  ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ..బన్నీ లుక్స్ ..బన్నీ పర్ఫామెన్స్ అబ్బా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో.  అస్సలు తనివి తీరదు బన్ని పర్ఫామెన్స్ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అయితే చాలా పెద్ద స్టార్ హీరోస్ ఇలా చీర కట్టుకోవడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు.  అయితే బన్నీ మాత్రం అలా చీర కట్టుకొని నటించడానికి ఒప్పుకొని బిగ్ సాహసమే చేశాడు అని చెప్పాలి.


అయితే అల్లు అర్జున్ లాగే ప్రభాస్ కూడా ఒక సినిమాలో చీర కట్టుకొని నటించాల్సి ఉండిందట . ఆ సినిమా మరేదో కాదు "రెబెల్" . ఎస్ తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఒకానొక సన్నివేశంలో క్యాట్ వాక్ చేస్తున్న విధంగా ప్రభాస్ చీర కట్టుకొని మరి ర్యాంప్ వాక్ చేయాల్సిందట . కానీ అంత పెద్ద స్టార్ హీరో అలా స్టైలిష్ గా చీర కట్టుకొని వాక్ చేస్తే కచ్చితంగా ఫాన్స్ హర్ట్ అవుతారు అన్న విధంగా ఆలోచించిన డైరెక్టర్ ఆ సీన్నే ఎత్తేసారట . ఒకవేళ ప్రభాస్ కూడా అలా చేసుంటే  మాత్రం.. సినిమా ఇండస్ట్రీ ఓ రేంజ్ లో ఊగిపోయి ఉండేదని చెప్పాలి.  ఇప్పుడు బన్నీ ఏ రికార్డ్స్ అయితే కొల్లగొట్టాడో అలాంటి రికార్డ్స్ రెబల్ సినిమాతోనే కొల్లగొట్టి ఉండేవాడు ప్రభాస్ . కాని రెబల్ సినిమా అనుకున్నంత హిట్ అందుకోలేకపోయింది . ఆ తర్వాత ప్రభాస్ కూడా పాన్ ఇండియా  స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని అల్లాడించేస్తున్నాడు . ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమా షూట్ తో బిజీ బిజీగా ఉన్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: