రోహిత్ చప్పబడిపోయాడు.. దినేష్ కార్తీక్ కామెంట్స్ వైరల్?

praveen
సరిగ్గా 3 సంవత్సరాల క్రితం, అంటే 2021లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ పై ఆడినట్లే భారత కెప్టెన్ మెరిట్‌ పై బంతులు ఆడుతూ, మరిన్ని డెలివరీలను వదిలివేయాలని కార్తీక్ భావిస్తున్నాడు. అవును, రోహిత్ శర్మ తాను చేసిన దాని నుండి స్ఫూర్తి అయితే ఖచ్చితంగా పొంది తీరాల్సిందేనని భారత రిటైర్డ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ... "రోహిత్ లార్డ్స్‌లో చేసిన దాని నుండి కొంచెం అయినా ఇపుడు శక్తిని పొందాల్సిన అవసరం ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న రోజున, KL రాహుల్ మరియు రోహిత్ శర్మ ఒక బంతిని వదిలి ఎక్కువసేపు ఆడటం ఎలాగో చూపించారు ! అది గుర్తు పెట్టుకోండి !" అని అతను క్రిక్‌బజ్‌తో చెప్పగా ఆ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విషయం ఏమిటంటే... 3వ టెస్టులో భారత్‌ను రక్షించే క్రమంలో అవకాశాలను మెరుగు పరుచుకోవాలని, దానికి రోహిత్ గరిష్ట సమయాన్ని క్రీజులో గడపాలని కార్తీక్ సూచించాడు. ఈ నేపథ్యంలో దినేష్ మాట్లాడుతూ... రోహిత్ క్రీజులో ఎక్కువ సమయం కేటాయిస్తే అది భారత్‌కు చాలా మేలు చేకూరుస్తుంది. తద్వారా జట్టు డ్రాకు చేరువవుతుంది... అని అన్నాడు. 2021లో ఇంగ్లండ్ టూర్‌లో భారత్‌కు ఓపెనింగ్ చేసే బాధ్యతను రోహిత్ మరియు KL రాహుల్ అప్పగించిన సంగతి విదితమే. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఈ జోడీ దాదాపు 683 పరుగులు చేసి చివరికి 2-2తో డ్రాగా మ్యాచ్ ముగియడానికి ఎంతో కృషి చేసారు. ఈ పర్యటనలో రెండో టెస్టులో రోహిత్ లార్డ్స్‌లో 83 పరుగులతో ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసినదే. దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ స్టార్ పర్ఫార్మర్ కాగా, రెడ్ బాల్ క్రికెట్‌లో అతని ఇటీవలి ఫామ్ విమర్శలకు గురవుతుండడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: