జనసేన: అల్లు అర్జున్ కు సిగ్గు శరం ఉందా..వాళ్లకు రూ.25 లక్షలే ఇస్తావా ?
అల్లు అర్జున్ కు, ఆయన నిర్మాతలకు కొంచమైన సిగ్గు శరం ఉండాలి అంటూ శాంతి ఆగ్రహించింది. వారిని అసలు మనుషులు అని అంటారా? మానవత్వం కొంచమైనా ఉందా? కేసు మాఫీ కోసం వారికి ముష్టి వేస్తున్నారా అంటూ ఎక్స్ లో జనసేన నేత సింగలూరి శాంతి ప్రసాద్ మాట్లాడారు. కాగా, అల్లు అర్జున్ మరణించిన రేవతి కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకు వచ్చాడు.
పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో తాను చాలా షాక్ కు గురి అయ్యానని అల్లు అర్జున్ అనౌన్స్ చేశాడు. ఆ మరణ వార్తతో పుష్ప2 సెలబ్రేషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోయాను అంటూ అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. రేవతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లుగా అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. రేవతి కుటుంబానికి సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారంటూ అల్లు అర్జున్ వెల్లడించాడు.
అంతేకాకుండా రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. రేవతి పిల్లలకు ఎలాంటి సహాయం చేయడానికి అయినా తాను సిద్ధంగా ఉంటానని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన అనంతరం జనసేన నేత శాంతి ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.