వామ్మో: ఎన్టీఆర్ మూవీని మధ్యలో ఆపేద్దామన్న నిర్మాత.. కట్ చేస్తే..?
తనకు రభస సినిమా ఏ మాత్రం నచ్చలేదని వెల్లడించారు. షూటింగ్ మధ్యలో ఉండగానే తాను చూసి ఈ సినిమా ఆడదని కూడా చెప్పానని కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని నమ్మానని సురేష్ వెల్లడించారు.. అయితే రభస చిత్రాన్ని ఆపేద్దామని చిత్ర బృందానికి చెప్పానని.. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందని మీకు అర్థం కావట్లేదు అంటూ తనకు సర్ది చెప్పాడని తెలిపారు.. కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమా తన అభిప్రాయమే కరెక్ట్ అయిందని తెలిపారు బెల్లంకొండ సురేష్..
కానీ తాను అనుకున్న స్థాయిలో మాత్రం ఫ్లాప్ కాలేదని తెలిపారు.. ఎన్టీఆర్ హీరోగా ఉండడం ,కందిరీగ డైరెక్టర్ సినిమా కావడం చేత ప్రేక్షకులు థియేటర్కు బాగానే వచ్చారని ఓపెనింగ్స్ కూడా బాగానే రాబట్టాయని చిత్రం ముగిసే సమయానికి 90 శాతం వరకు రికవరీ సాధించింది అని తెలిపారు. బాక్సాఫీస్ వద్ద ఎబోవ్ యావరేజ్ గా రభస సినిమా నిలిచిందట.. ఇదంతా కూడా ఎన్టీఆర్ స్టార్ట్ అవ్వడం వల్లే సాధ్యమైందని.. ఆ సమయంలో ఎన్టీఆర్ నమ్మకం పెట్టుకున్నట్టుగానే ఆడిందని తెలిపారు.. 2014లో రభస సినిమా విడుదల అయింది ఇందులో సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్స్ గా నటించారు.