ఊహించని దెబ్బ .. రెండో రోజే తెలుగులో పుష్ప2కు భారీ షాక్..!

Amruth kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసింది . అఫీషియల్ గా లెక్కలు రాకపోయినా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల కు పైగా గ్రాస్ ను రాబట్టిందని తెలుస్తుంది . అటు ఓవర్సీస్ లోనూ 4.5 బిలియన్ అంటే భారతీయ కరెన్సీ లో సుమారు 40 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తుంది . ఇక హిందీ లో అయితే ఏకంగా 65 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిందట .

 
ఇక తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 రెండో రోజు కొంత మేరకు కలెక్షన్లో తగ్గుదల  కనిపిస్తుంది . అయితే నార్త్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది . తెలుగు బుకింగ్స్ లో మార్పు కనబడుతుంది . తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర తన  స‌త్త చూప‌టం ఆశ్చర్యం లేదు కానీ రెండో రోజు అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ డ్రాప్ కనిపించడం ఆశ్చర్యంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి . ఇక నార్త్‌లో రెండో రోజు 60 శాతం అడ్వాన్స్ బుకింగ్లు కనిపించాయి అంటే రెండో రోజు కచ్చితంగా 50 కోట్లకు పైగా నికర కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు .

అలాగే సౌత్ కు వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అడ్వాన్సుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఉన్నాయి .. అందుకు కారణం టిక్కెట్ రేట్లు .. మెగా అభిమానుల ఊహించిని బ్యాన్ కారణమని కూడా అంటున్నారు . ఈ రెండు కాకుంటే రేపు రేపు శని.. ఆదివారాలు వీకెండ్ కావడం తో అప్పటికి చాలా మంది ప్లాన్ చేసుకోవడం కూడా ఈరోజు కలెక్షన్లు తగ్గటానికి కారణమని మరి కొందరు అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: