సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు తల్లి మృతి..!

Divya
తెలుగు, తమిళ సినిమా ప్రేక్షకులకు నటుడు కేఎస్ రవికుమార్ బాగా సుపరిచితమే.. తన విభిన్నమైన కామెడీతో పాటుగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో కూడా నటించి బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.. 1990లో తన సినిమా కెరియర్ ని మొదలుపెట్టిన ఈ నటుడు గానే కాకుండా డైరెక్టర్గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన ఈ నటుడు ఇంట తాజాగా విషాదఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా కె.ఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమ్మల్ అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని సైతం రవికుమార్ స్వయంగా తెలియజేశారు.. తన తల్లి వయసు 90 సంవత్సరాలు అని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోందని ఇటీవలే కన్ను మూసినట్టుగా తెలియజేశారు.. ముఖ్యంగా నటుడు కేఎస్ రవికుమార్ బాలయ్యతో జై సింహ, రూలర్ వంటి సినిమాలను తీశారు.. నటుడుగా మెప్పించిన రవి తెలుగులో కూడా విలన్, భద్ర, నరసింహ తదితర చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించారు.

ప్రస్తుతం నటుడు కేఎస్ రవికుమార్ వాస్కోడిగామా, అందగన్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం కేఎస్ రవికుమార్ కు ధైర్యం చెబుతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. చివరిగా కాంగువ సినిమాలో నటించారు.. అయితే తెలుగులో బాలయ్య తో తీసిన చిత్రాలలో జై సింహా మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల వైపు అసలు చూడలేదు ఈ నటుడు.. మరి రాబోయే రోజుల్లోనైనా మళ్లీ తెలుగు నటులతో సినిమాలు తీస్తారేమో చూడాలి మరి.. ముఖ్యంగా ఈయన  చేసే కామెంట్స్ కూడా అప్పుడప్పుడు పలు రకాల వివాదాలకు దారి తీసేలా ఉంటాయి. గతంలో బాలకృష్ణతో పనిచేస్తున్నప్పుడు జరిగిన కొన్ని సందర్భాలను కూడా తెలియజేశారు నటుడు కేఎస్ రవికుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: