పుష్ప ది రూల్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఉమైర్ సంధు.. ఏకంగా అన్ని స్టార్స్!

Reddy P Rajasekhar
పుష్ప ది రూల్ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రివ్యూ వస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బాహుబలి2 తర్వాత ఆ రేంజ్ లో యునానిమస్ టాక్ వచ్చిన సినిమాలు చాలా రేర్ అనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాకు అలాంటి టాక్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
 
ఏకంగా నాలుగు స్టార్స్ తో ఉమైర్ సంధు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప ది రూల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అని ఉమైర్ సంధు అన్నారు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమా స్థాయిని మరింత పెంచిందని ఆయన చెప్పుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ నంబర్ వన్ హీరో అనిపించుకుంటాడని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.
 
ప్రభాస్ స్థానాన్ని బన్నీ ఆక్రమిస్తాడంటూ ఉమైర్ సంధు ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చలికాలంలో పుష్ప2 రిలీజ్ తో ప్రతిచోటా వైల్డ్ ఫైర్ అంటూ ఉమైర్ సంధు చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. పుష్ప2 విషయంలో కుళ్లుకోవద్దని ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని మరో ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్ గురించి ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఉమైర్ సంధు ప్రశ్నించారు.
 
పుష్ప ది రూల్ సినిమా మైత్రీ బ్యానర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని హైయెస్ట్ బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. పుష్ప2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: