హల్దీ ఫంక్షన్ లో శోభిత... పొట్టి బట్టలు అంటూ ట్రోలింగ్ ?
దీంతో హల్దీ, మంగళ స్నానం వంటి ఫంక్షన్లను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, తాజాగా శోభిత మంగళ స్నానం ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో శోభిత స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంతే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయమైన ఫంక్షన్ కి స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించడం ఏంటని కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.
నిండుగా బ్లౌజ్ ధరించి ఉండొచ్చు కదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక శోభిత అభిమానులు తనకు నచ్చినట్టుగా ఉంటుంది. ఆ చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శోభిత చాలా అందంగా ఉందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలలో శోభిత స్లీవ్ లెస్ బ్లౌజ్, పసుపు రంగు చీరను ధరించింది. అంతేకాకుండా సాంప్రదాయంగా బంగారు నగలను వేసుకుంది. ఈ ఫోటోలను శోభిత తన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
చైతు, శోభిత వివాహం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, వివాహం తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా లేదా అని శోభిత అభిమానులు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలావరకు హీరోయిన్లు వివాహం తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా మానేశారు. మరి శోభిత సినిమాలు చేస్తుందా లేదా చూడాలి. ఈ విషయంపై శోభిత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.