కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో లలో సూర్య ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమై న సినిమాలలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . సూర్య తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో విడుదల చేయగా అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను అందుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూర్యకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా సూర్య , శివ దర్శకత్వంలో కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది.
కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే సూర్య తన తదుపరి మూవీ ని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ లో ఫిక్స్ చేయకపోవడంతో సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాకు ఓ టైటిల్ ను ఈ మూవీ బృందం వారు కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కల్ట్ పేరుతో అధర్వ హీరో గా ఒక టైటిల్ ను నిర్మాతల సంఘం లో రిజిస్టర్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఆ టైటిల్ కోసం సంబంధిత నిర్మాతను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత అంగీకరిస్తే సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాకు కల్ట్ అనే టైటిల్ ను కన్ఫామ్ చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.