ఈ దెబ్బతో ఆదిపురుష్ డైరెక్టర్ దశ తిరిగేనా..?
ఇప్పటివరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన, ఈ తీరిక సమయంలో ఏం చేశాడు? అనే ప్రశ్న అందరిలో మొదలయింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తన తదుపరి చిత్రాన్ని అజయ్ దేవగన్ తో భారీ హిస్టారికల్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇందులో హృతిక్ రోషన్ కూడా నటించాలని దేవగన్ కోరినట్లు సమాచారం. 2020 బ్లాక్ బాస్టర్ తానాజీ: ది అన్ సింగ్ వారియర్ సినిమాలో పనిచేసిన అజయ్ మరో హిస్టారికల్ సినిమాతో రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ప్రాంచీలో కొత్త సినిమా కోసం డైరెక్టర్ ఓం రౌత్ ను కలిసినట్లు సమాచారం. ఇందులో హీరోగా అజయ్ దేవగన్ , విలన్గా హృతిక్ నటింపజేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చర్చలు దశలో ఉంది. ఇంకా కథాంశం కూడా ఫైనల్ కాలేదు. దీనిపైనే ఓం రౌత్ పనిచేస్తున్నట్లు సమాచారం. హృతిక్ కి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెంట్స్ , చరిష్మా ఉందని అజయ్ దేవగన్ భావిస్తున్నారట. అతడి నటన ప్రతిభ తానాజీ ఫ్రాంఛైజీ కలిసి వస్తుందని దేవగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే డైరెక్టర్ ఓం రౌత్ అదృష్టం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పవచ్చు..