బన్నీ మూవీ హిట్టైనా ఆమెకు లక్ కలిసిరాలేదా.. అక్కడ భారీ షాక్ తగిలిందిగా!

Reddy P Rajasekhar
అల్లు అర్జున్ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన బన్నీ మూవీ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2005 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా గౌరీ ముంజల్ నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ ఒక పాటను మించి మరొకటి హిట్ గా నిలిచాయి.
 
అయితే గౌరీ ముంజల్ కు మాత్రం తర్వాత రోజుల్లో ఆఫర్లు మాత్రం ఎక్కువ సంఖ్యలో రాలేదనే చెప్పాలి. నటిగా మోడల్ గా గౌరీ ముంజల్ మంచి గుర్తింపును సొంతం చేసుకోగా తర్వాత రోజుల్లో ఆమెకు చిన్న సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వచ్చాయి. శ్రీ కృష్ణ 2006, గోపి, భూ కైలాస్, కౌసల్యా సుప్రజా రామ, బంగారు బాబు సినిమాలలో ఆమె నటించగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి.
 
కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సైతం గౌరీ ముంజల్ నటించారు. అయితే అక్కడ కూడా ఈ బ్యూటీ కెరీర్ పెద్దగా పుంజుకోలేదనే చెప్పవచ్చు. 2011 సంవత్సరం వరకు కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తర్వాత రోజుల్లో ఆఫర్లు లేక కెరీర్ పరంగా వెనుకబడ్డారు. ఈ బ్యూటీకి పేరు కూడా ఒకింత మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. వ్యక్తిగత కారణాల వల్ల గౌరీ ముంజల్ సినిమాలకు దూరమయ్యారని సమాచారం అందుతోంది.
 
ప్రస్తుతం గౌరీ ముంజల్ పలు వ్యాపారాలను చూసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. గౌరీ ముంజల్ ను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గౌరీ ముంజల్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. రాబోయే రోజుల్లో గౌరీ ముంజల్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. గౌరీ ముంజల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: