ఆంధ్రావాలాలో హీరో మృతి...ఆ లాజిక్ మిస్ కాకుంటే మూవీ బ్లాక్ బస్టర్ ?
అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా ఒకటి. ఆంధ్ర వాళ్ళ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2004 జనవరి ఒకటో తేదీన సంక్రాంతి కానుకగా అప్పట్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆర్ఆర్ వెంకట్, కోన వెంకట్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంగీతం అందించింది చక్రి అయితే.. నిర్మాణ కంపెనీగా శ్రీ భారతి ఎంటర్ప్రైజెస్ ఉంది.
అయితే ఈ సినిమాలో... జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన... రక్షిత నటించారు. ఈ సినిమా మొత్తం కార్మికులు, యాక్షన్ నేపథ్యంలో వచ్చింది. ఇందులో తండ్రి పాత్రలో, అలాగే కొడుకు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర ఉంటుంది. ఓ ఏరియాలో... అక్కడ ఉన్న జనాలకు అండగా నిలుస్తూ... తండ్రి పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్... కనిపిస్తారు.
వాళ్లకు ఇలాంటి కష్టం వచ్చినా... ఆదుకుంటారు. విలన్స్ నుంచి కాపాడుతారు. ఈ తరుణంలోనే ఆంధ్రావాలగా ఆ ఏరియాలో... ఎదుగుతాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే... ఈ సినిమా కథ డిమాండ్ చేసిన నేపథ్యంలో... జూనియర్ ఎన్టీఆర్ మరణించేలా సీన్ క్రియేట్ చేశారు పూరి జగన్నాథ్. దీంతో అక్కడి నుంచి మరో ఎన్టీఆర్... కొడుకు పాత్రలో ఎంట్రీ ఇస్తాడు. అయితే ఇక్కడ వరకు బాగున్న... మొదటి ఎన్టీఆర్ మరణించడంతో ఈ సినిమాకు మైనస్ అయింది. దీంతో సినిమా పెద్దగా ఆడలేదు.