సానియా మీర్జా రెండో పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్.. వరుడు ఎవరంటే..?

Divya
సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించుకొని వివాహం చేసుకున్నప్పటికీ 14 ఏళ్ల బంధానికి ఇద్దరు కూడా ఇటీవలే పుల్ స్టాప్ పెట్టారు.. దీంతో షోయబ్ మాత్రం సానియా మిర్జా నుంచి విడిపోయిన వెంటనే గ్యాప్ తీసుకోకుండా మరొక వివాహం చేసుకున్నారు.. అయితే సానియా మీర్జా మాత్రం ఇప్పటివరకు రెండో వివాహం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు చేసుకోలేదు. తన కుమారుడితో కలిసి మాత్రమే జీవిస్తూ ఉన్నది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు సన్నిహితులు సైతం ఒత్తిడి తెస్తూ ఉన్న ఇప్పటివరకు అలాంటి అవకాశాన్ని తీసుకోలేదు సానియా మీర్జా.

అయితే ఇలాంటి సమయంలోనే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రెండో వివాహం చేసుకోబోతున్నారని విధంగా ప్రచారం సాగింది. అయితే ఇదంతా కూడా ఫేక్ రూమర్స్ అంటే సానియా మీర్జా తండ్రి ఖండించారు.. ఇక సానియా మీర్జా కూడా ప్రస్తుతం ఒంటరిగా ఉండకూడదని కుటుంబ సభ్యులు భావించడమే కాకుండా పాకిస్తాన్ నటుడు నాబిల్ జాఫర్ కూడా ఈమెను మరొక వివాహం చేసుకోమని సలహా ఇచ్చారు. అయితే సానియా మీర్జా మాత్రం పెళ్లి అంటే తనకు చాలా విరక్తి కలిగిందని చెప్పినట్లు సమాచారం. ఇటీవలే సానియాకు ఒక ఇంటర్వ్యూలో జాఫర్ హితబోధ చేసినట్లుగా సమాచారం.

విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసినట్లు కాదు.. అజ్ఞానంతో చాలామంది మంచి భవిష్యత్తును కోల్పోతూ ఉంటారు.. అలా ఆలోచించడం తప్పు అంటూ తెలిపారు విడాకులు అనేది ఒక దురదృష్టకరమని ఎవరి జీవితంలోనైనా ఇలాంటి చీకటి రోజు ఉండకూడదంటూ తెలియజేశారు. దీంతో తాజాగా సానియా మీర్జా కూడా ఒక కొత్త జీవితం ప్రారంభించాలి అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు సానియా మనసు మారినట్టు ఉంది రెండో వివాహానికి సిద్ధమయ్యింది అన్నట్లుగా అందుకే ఇలా హింట్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈసారైనా ఆచితూచి అడుగు వెయ్యండి అంటూ సలహా ఇస్తున్నారు. ఒకవేళ రెండో పెళ్లి అయితే వరుడు గురించి ముందుగానే హింట్ ఇస్తుందేమో చూడాలి.మరి ఏంటన్నది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: