నాగార్జున చిన్న కోడలు...సమంతకు ఉన్న రిలేషన్‌ ఇదే ?

Veldandi Saikiran
సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్, జైనబ్ రావడ్జీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరుపుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీన జరగనుండగా ఫ్యాన్స్ ఖుషిలో ఉన్నారు. ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని తెలిసి తెగ సంబరపడిపోతున్నారు. 


అఖిల్, జైనబ్ ఆరేళ్ల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయట పెట్టలేదు. కుటుంబ సభ్యుల ఒప్పందంతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. జైనబ్ కూడా సినీ నటి అని సమాచారం. కానీ జైనబ్ సోషల్ మీడియాలో తన అకౌంట్లను ప్రైవసీలో పెట్టుకుంది. జైనబ్ చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. కోట్లకు వారసురాలు.


అఖిల్, జైనబ్ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనెలా ఉన్నారు. కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. కాగా జైనబ్, హీరోయిన్ సమంత ఇద్దరూ స్నేహితులు అని ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరూ ముంబైలో కలుసుకున్నారట. అంతేకాకుండా నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటికీ అఖిల్ మాత్రం సమంతతో టచ్ లోనే ఉంటారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.


ఈ క్రమంలోనే అఖిల్ తన ప్రియురాలిని సమంతకు పరిచయం చేసి ఉంటాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, జైనబ్ జంటకు సమంత కూడా విషెస్ తెలియజేసింది. మరి అఖిల్ వివాహానికి సమంత వెళుతుందని కొంతమంది అంటున్నారు. ఓవైపు జైనబ్ స్నేహితురాలు, అంతేకాకుండా అఖిల్ తో మంచి స్నేహం ఉండడం వల్ల సమంత వీరి వివాహానికి వెళ్తుందా లేదా అని ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: