థైరాయిడ్ సమస్య ఉందా.. వీటి జోలికి అస్సలు వెళ్ళకండి..?

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారి నుండి పెద్ద వయసు వారి వరకు అనేక మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు . ఇక థైరాయిడ్ వచ్చిన వారు కొంత మంది ఎప్పటికప్పు డు డాక్టర్లను సంప్రదిస్తూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి , ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది తూచా తప్పకుండా పాటిస్తూ , అలాగే డాక్టర్ల సూచించిన మందుల ను ఎప్పటి కప్పుడు క్రమం తప్పకుండా వాడుతూ థైరాయిడ్ ను ఏ మాత్రం పెరగకుండా వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . ఇక కొంత మంది డాక్టర్ల సలహాలు పాటించకుండా తమ ఇష్టం వచ్చినవి తింటూ ఉంటారు . అలాంటి వారికి థైరాయిడ్ మరింత పెరిగే అవకాశం ఉంది . ఇక ఒక వేళ థైరాయిడ్ సమస్య కనుక ఉన్నట్లయితే కొన్ని ఆహారపు అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి. కొన్ని పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అలా థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారపు పదార్థాల నుండి దూరంగా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం.

థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు క్యాబేజీ , కాలీఫ్లవర్ , బ్రోకోలీ వంటి తదితర కూరగాయలతో వండిన వంటలను అస్సలు తీసుకోకూడదు. ఈ కూరగాయల వల్ల గాయిట్రోజేన్స్ గాంధీ పని తీరు మందగించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అందుకోసం క్యాబేజీ , కాలీఫ్లవర్ బ్రోకోలి కూరగాయలకు థైరాయిడ్ సమస్య ఉన్న వారు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయా ఉత్పత్తులను కూడా అస్సలు వినియోగించకూడదు. సోయా థైరాయిడ్ గ్రంధి శరీరం లోని అయోడిన్ ను వినియోగించకుండా అడ్డుకుంటాయి. అందుకోసం సోయా పదార్థాలకు థైరాయిడ్ సమస్య ఉన్న వారు దూరంగా ఉండడం ఎంతో మంచిది. అలాగే కాఫీ , ఆల్కహాల్ కి కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: