
వెంకీ మామ ఊచకోత...ఆ రికార్డు బద్దలు కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం!
ఇక ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్లు గా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఇక ఇటీవల ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం గడవకముందే వంద కోట్లకు పైగా కాలక్షన్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు.
ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వచ్చిన సినిమా ఇది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్ ని అందించారు. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉండడంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.