జూనియర్ ఎన్టీఆర్ ను ఒంటరివాడిని చేసిన తండ్రి మరణం.. అంతలా బాధ పెట్టారా?
అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తండ్రి మరణం ఒంటరి వాడిని చేసిందని చెప్పవచ్చు. ఒకానొక సందర్భంలో తారక్ హరికృష్ణ మరణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్న మరణం మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. తండ్రి మరణించిన సమయంలో అమ్మ ఎంతో బాధ పడ్డారని తారక్ కామెంట్లు చేశారు. నేను, నా పిల్లలు ఓదార్చడంతో ఆమె నెమ్మదిగా కోలుకున్నారని తారక్ చెప్పుకొచ్చారు.
2018 సంవత్సరం ఆగష్టు నెల 29వ తేదీన నల్గొండ జిల్లా అన్నెపర్తి దగ్గర జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సన్నిహ్గితులు తల్లడిల్లిపోయారు. 61 సంవత్సరాల వయస్సులో హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణ మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలు అందించడం గమనార్హం.
హరికృష్ణ తన మరణానికి కొన్ని గంటల ముందు రాసిన ఒక లేఖ సైతం నెట్టింట వైరల్ అయింది. హరికృష్ణ కొడుకులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబ సభ్యులను సైతం ఎంతో బాధ పెట్టింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కొన్నిరోజుల పాటు ఒంటరివాడయ్యాడు. పుట్టినరోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు హరికృష్ణ మృతి చెందారు. ఎన్టీఆర్ అరవింద సమేత మూవీ షూట్ లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.