ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న చిరంజీవి.. లుక్స్ మాత్రం అస్సలు బాలేవుగా!

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవి తను నటించిన సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. విశ్వంభర సినిమాలో సైతం చిరంజీవి తన లుక్స్ తో అదుర్స్ అనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఆచార్య సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మాత్రం చిరంజీవి లుక్స్ అస్సలు బాలేవని చెప్పవచ్చు. గ్రాఫిక్స్ తో ఉన్న ఆ సన్నివేశాలు సినిమాకు సైతం మైనస్ అయ్యాయి.
 
ఆచార్య సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో చిరంజీవి వయస్సు తక్కువగా చూపించాలని కొరటాల శివ చేసిన ప్రయోగం వికటించింది. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఆచార్య ఫ్లాప్ చిరంజీవి కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య మూవీ హిట్ గా నిలిచినా భోళా శంకర్ రూపంలో చిరంజీవికి మరో భారీ షాక్ తగిలింది.
 
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాపైనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తైనా గ్లింప్స్ విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో గ్రాఫిక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. చిరంజీవి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.
 
చిరంజీవి తన సినిమాలలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న చిరంజీవి తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. చిరంజీవి భవిష్యత్తు సినిమాలు సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి పాన్ ఇండియా రేంజ్ లో హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి ఇతర భాషలపై సైతం స్పెషల్ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: