అల్లు ఇంట పెళ్లి సందడి.. ఎవరిదంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేతగా పేరు పొందిన అల్లు అరవింద్ ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు.. ఈయన కుమారులు అల్లు అర్జున్, అల్లు బాబి ,అల్లు శిరీష్ కూడా సినీ ఇండస్ట్రీలోనే రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా అల్లు ఇంట పెళ్లి సందడి నెలకొన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

అల్లు అరవింద్ మనవడి వివాహం గడచిన కొన్ని గంటల క్రితం జరిగిందట. ఆ మనవడు ఎవరిదో కాదు అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి కుమారుడైన రామకృష్ణ తేజ వివాహం జరిగింది.. అమ్మాయి సాయి సంజనతో చాలా గ్రాండ్గా వివాహం జరిగింది.. వీరి వివాహానికి సైతం మెగా కుటుంబ సభ్యులు వచ్చి ఆశీర్వదించారట. అలాగే ఈ పెళ్లి వేడుకలలో అల్లు అర్జున్ అల్లు శిరీష్ తో సహా పలువురు సెలబ్రిటీలు కూడా కనిపించినట్లు సమాచారం. బాబి వారసుడు పెళ్లి ఫోటోలు సంబంధించి ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి.. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు బాబీ కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ పైన డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. అలాగే నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. మొత్తానికి అల్లు కుటుంబం  ఇంట వివాహ వేడుకలు జరగడంతో మెగా కుటుంబం రావడంతో ఇక విభేదాలకు చెక్ పెట్టారని కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే వాస్తవానికి అల్లు శిరీష్ పెళ్లి గత కొద్ది నెలలుగా ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు వారి ఇంట పెళ్లి అనగానే అందరూ అల్లు శిరీష్ వివాహమే అనుకున్నారు.కానీ అల్లు బాబి కుమారుడు వివాహమని తెలియగానే కాస్త అల్లు శిరీష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: