చిన్న సినిమా.. చిరంజీవికి పోటీగా వస్తే.. చివరికి 6 నంది అవార్డులు.. ఇంతకీ మూవీ ఏదంటే?
అయితే కమర్షియల్ సినిమాలకు పోటీగా వస్తే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమే. కానీ కంటెంట్ బాగుండి.. మౌత్ టాక్ వేగంగా ప్రేక్షకుల్లోకి వెళ్తే మాత్రం ఇక లాంగ్ రన్ ఉంటుంది అన్నది ఈ మధ్యకాలంలో హనుమాన్ అనే మూవీ నిరూపించింది. చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించింది ఈ సినిమా. అయితే గతంలో కూడా మెగాస్టార్ లాంటి స్టార్ హీరో మూవీకి పోటీగా వచ్చి ఏకంగా 6 నంది అవార్డులను కొల్లగొట్టింది ఓ చిన్న సినిమా. ఆ సినిమా ఏదో కాదు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్.
ఈ సినిమా విడుదలయ్యే సమయానికి హీరో హీరోయిన్లుగా నటించిన రాజ, కమలిని ముఖర్జీకి పెద్దగా గుర్తింపే లేదు. అసలు వాళ్ళెవరో కూడా ఆడియన్స్ కి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాకి పోటీగా ఆనంద్ మూవీ రిలీజ్ అయింది. అక్టోబర్ 15 శంకర్ దాదా ఎంబిబిఎస్ రిలీజ్ అయితే.. అదే రోజున ఆనంద్ మూవీ ని పరిమిత థియేటర్స్ లో రిలీజ్ చేశారు. శంకర్ దాదా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయినప్పటికీ ఆనంద్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. మెగాస్టార్ సినిమాకు పోటీగా వచ్చి బెస్ట్ ఫీచర్ ఫిలిం.. బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా మొత్తం ఆరు విభాగాల్లో ఆనంద్ చిత్రం నంది అవార్డులను అందుకుంది.