అల్లు అర్జున్ పై మరొకసారి తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు..!

Divya
గత కొంతకాలంగా అల్లు అర్జున్ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు కారణమనే విధంగా కేసు నమోదు కావడంతో ఈ కేసు పైన అల్లు అర్జున్ ని అరెస్టు చేసి ఒకరోజు జైలుకు వెళ్లడంతో పాటుగా బెయిల్ మీద బయటికి వచ్చారు.. అప్పటినుంచి సినీ ఇండస్ట్రీ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించారు.. ముఖ్యంగా రేవతి మరణించడంతో పాటుగా అతని కుమారుడు శ్రీ తేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు.

ఈ విషయం పైన ఎవరు స్పందించలేదని అంతేకాకుండా ఎవరు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో సినీ ఇండస్ట్రీకి ఇక మీదట ఎలాంటి బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు ఉండదంటూ అసెంబ్లీలోనే తెగేసి చెప్పడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో అలా రోజు రోజుకి సినీ ఇండస్ట్రీ తెలంగాణ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వార్తలు పెద్దదవుతూ ఉండడంతో.. ఇటీవలే FDC చైర్మన్ అయినా దిల్ రాజు ఈ రోజున సినీ సెలబ్రిటీలతో సుమారుగా 46 మందితో ఒక భేటీ ఏర్పరిచారు.

ఇందులో అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత.. సెలబ్రిటీలకు కూడా తమ విషయాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తాను కొన్ని కండిషన్లను సైతం విధించారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజల పట్ల గౌరవంగా ఉండాలని అలాగే గంజాయి డ్రగ్స్ వంటి వాటిని అరికట్టేందుకు సినీ ఇండస్ట్రీ సహకరించాలనితో తెలిపారు.అయితే ఇలాంటి సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి ప్రస్తావించడం జరిగింది.. అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది అసలు బన్నీ నాకు చిన్నప్పటినుంచి బాగా తెలుసు తనతో కలిసి తిరిగే వారని వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా చట్టపరంగా వ్యవహరించాల్సిందే అంటూ తెలిపారు. ఈ విషయాలను సినీ పెద్దలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి వాక్యానించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: